తెలంగాణలో మరో ఘోరం చోటుచేసుకుంది. మంచిర్యాలలో జరిగిన ఘటన సర్వత్రా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలతో తండ్రిని కొడుకు హత్య చేయడం ఊర్లో పెను విషాదానికి దారి తీసింది. హాజీపూర్ మండలం రాపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన పట్ల పోలీసులు తాజాగా స్పందించారు.
స్థానికంగా తెలుసుకున్న వివరాల మేరకు దుర్గం ప్రసాద్ రాపల్లిలో చర్చిఫాదర్ గా విధులను నిర్వహిస్తూ చర్చి వెనుకాల కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. అదే సమయంలో కుటుంబ కలహాలతో పెద్ద కొడుకు ప్రణవ్ తండ్రిని బుధవారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి చంపేడని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే… మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారని… సమాచారం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ ఘటనా స్థలికి చేరుకొని విచారించారని తెలిపారు.