తెలంగాణలోని నల్లగొండ జిల్లాలా ఘోరం చోటు చేసుకుంది. నల్లగొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో విషాదం అలముకుంది. కన్న కొడుకే తల్లి పట్ల కాలయముడుగా మారాడు. కన్నకొడుకే మంచంపట్టిన తల్లి ఒంటిపై కిరోసిన్ పోసేసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అక్కడ ఊరులోని తిరుమల శాంతమ్మ అనే మహిళ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కొడుకు లింగస్వామి తల్లి శాంతమ్మను ఇంటి వద్దే వదిలి హైదరాబాద్లో కూలీ పనిచేసుకుంటూ గడుపుతున్నాడు. పది రోజుల క్రితం కొడుకు లింగస్వామి గ్రామానికి వచ్చాడు.