కొబ్బ‌రి మ‌ట్ట నుండి అఈ సాంగ్ విడుద‌ల‌

song released from kobbarimatta movie

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ న‌టించిన కొబ్బ‌రి మ‌ట్ట చిత్రం జూలై 19న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. 2015లో మొద‌లైన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కి మ‌రో వారంలో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. ఇక సినిమాపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించేందుకు మేక‌ర్స్ ప్రోమో సాంగ్స్ విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. జూలై 15న చిత్రం నుండి అఈ అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. హృదయ కాలేయం టీం నుండి వస్తున్న ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. కొబ్బ‌రి మ‌ట్ట చిత్రానికి సంబంధించి గ‌తంలో ప‌లు సాంగ్స్‌, టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ‘హృదయ కాలేయం’, ‘సింగం 123’ తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు కొబ్బరి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు.