Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా శృంగార చిత్రం ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. పోర్న్‌స్టార్ మియాతో తెరకెక్కించిన ఈ చిత్రంకు మిశ్రమ స్పందన దక్కింది. వర్మ అనుకున్నట్లుగా ఈ సినిమాకు ఫుల్‌గా పబ్లిసిటీ దక్కింది. అందుకు తగ్గట్లుగా వర్మ ఆశించిన రీతిలో ఆదాయం కూడా వచ్చింది. అందుకే వర్మ ఇప్పుడు ‘జీఎస్టీ’కి సీక్వెల్‌ను తీసే యోచనలో ఉన్నాడు. తాజాగా వర్మ మాట్లాడుతూ.. నేను అనుకున్నదాని కంటే ఎక్కువ విజయాన్ని ఈ చిత్రం దక్కించుకుంది. మంచి సినిమాకు సీక్వెల్ తీయాలని అంతా భావిస్తారు. అదే విధంగా నేను కూడా ఈ సినిమాకు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. వర్మ సీక్వెల్ ఆలోచనపై అప్పుడే చర్చ మొదలైంది.
రెండు దశాబ్దాల క్రితం సౌత్ ఇండియాలో తన శృంగార చిత్రాతో ఉర్రూతలూగించి, స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చిన షకీలా మళ్లీ రీ ఎంట్రీకి సిద్దం అవుతుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే వర్మ జీఎస్టీ సినిమా గురించి స్పందించింది. మహిళ సంఘాల వారికి ఏం పని ఉండదు, అప్పట్లో నా సినిమాలపై కూడా ఆందోళనలు నిర్వహించే వారు. ఇప్పుడు వారి ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఒక వేళ వర్మ నాతో జీఎస్టీ 2ను తీస్తాను అంటే సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే వర్మ నన్ను బరువు తగ్గమంటాడేమో, అది మాత్రం కుదరదు అంటూ సరదాగా కామెంట్ చేసింది. నిజంగానే వర్మ షకీలాతో ఒక శృంగారభరిత చిత్రాన్ని చేస్తే చూడాలని కొందరు ఔత్సాహికులు కోరుకుంటున్నారు. మరి వర్మ అందుకు ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.