ప్రయాణికులకు కోసం ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ..!

AP Politics: High speed rail corridor from Hyderabad to Visakha..!
AP Politics: High speed rail corridor from Hyderabad to Visakha..!

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడగిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్లకు సంబంధించిన సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. నెంబర్ (రైలు నెంబర్ 07637) తిరుపతి -షిర్డీ సాయినగర్ రైలును సెప్టెంబర్ 3 నుంచి 24 వరకు ప్రతీ ఆదివారం నడవనున్నది.

అదేవిధంగా షిర్డీసాయినగర్-తిరుపతి (07638) రైలును సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు ప్రతీ సోమవారం ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాజీపేట-దాదర్ (07195) రైలు సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతీ గురువారం పరుగులు పెట్టనుంది. దాదర్ – కాజీపేట (07195) రైలు ప్రతీ శనివారం నడువనుంది.దక్షిణ మధ్య రైల్వే సెప్టెంబర్ 06 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొడిగించింది. కాజీపేట-దాదర్ (07197) వీక్లీ రైలు సెప్టెంబర్ 2-30 వరకు ప్రతీ శనివారం నడువనుంది. దాదర్-కాజీపేట (07198) మధ్య ఆదివారం అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ 3 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పొడగించింది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను మీ అవసరానికి వినియోగించుకొని మీ ప్రయాణాన్ని సుఖవంతంగా కొనసాగించండి.