స్పెషల్ : హార్ట్ అటాక్ బ్యూటీ సంచలనం

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు హాట్ బ్యూటీ ఆదా శర్మ. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలు చురుకుగా ఉంటూ ప్రతినిత్యం అందరితో టచ్‌లో ఉంటూ తన అందాలతో కిక్కిస్తూ నెటిజన్లను మైమరిపించేస్తుంటారు. అదీ ఆ హార్ట్ అటాక్ బ్యూటీ స్పెషల్. తెలుగులో ‘‘హార్ట్ అటాక్, S/O సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు ఆదాశర్మ.

అయితే చిత్ర పరిశ్రమలో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఈ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే భూతం రాజ్యమేలుతుందని.. అవకాశాల పేరుతో నటీమణులను లైంగికంగా వాడుకుంటున్నారని ఇప్పటికే ఎందరో సినీస్టార్స్ వాపోయిన విషయం తెలిసిందే. అయితే మీటూ, కాస్టింగ్ కౌచ్ వంటి ఉద్యమాల ప్రభావంతో చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక దాడుల పట్ల చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే మంచమెక్కాల్సిందే అంటూ కొందరు నటీమణులు బాహాటంగానే కామెంట్స్ ను గుప్పించారు. దీంతో అప్పట్లో ఈ విషయంపై పెద్ద దుమారమే రాజుకుంది. దాంట్లో చాలా మంది సుప్రసిద్ధుల బండారం కూడా బయటపడింది.

అదేవిధంగా కొంతమంది నటీమణులు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీరంగంలోనే కాదని.. అన్ని రంగాల్లోనూ వేళ్లూనుకొని ఉందని చెప్తున్నారు. అయినా లైంగిక లొంగుబాటు అనేది వ్యక్తి ఇష్టాయిష్టాలకు సంబంధించిందని కూడా కొంతమంది అభిప్రాయాన్ని ఇదివరకే వ్యక్తే చేస్తున్నారు. దీంతో తాజాగా కాస్టింగ్ కౌచ్ అంశంపై హాట్ బ్యూటీ ఆదా శర్మ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. ఆమె ఏమన్నారంటే.. కాస్టింగ్ కౌచ్‌ అనేది బలవంతపు చర్య కాదని చెప్పారు. మహిళలను లైంగికంగా దోచుకోవడమేనని.. అది కేవలం దక్షిణాది, ఉత్తరాదిలోనే కాదని..

ప్రపంచం మొత్తం అన్ని రంగాల్లో కూడా విస్తరించి ఉందని స్పష్టం చేసింది. కాకపోతే తప్పు చేయాలా? వద్దా? అనేది మన మీదే ఆధారపడి ఉంటుందని.. అవతలి వ్యక్తి బలవంతం చేశాడని లొంగిపోవడం ఆ తర్వాత దాన్ని బయటపెడుతూ రాద్ధాంతం చేయడం సరికాదని తెలిపింది ఆదా శర్మ. కాగా అవకాశం రాకున్నా ఫర్వాలేదు గానీ ముఖం మీదే కమిట్మెంట్ వంటి అంశాలకు నో చెప్పేస్తే ఇలాంటి గోల ఉండదనే కోణంలో ఆమె మాట్లాడటం విశేషం. కాగా ఈరోజు ఆదాశర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదాశర్మకు జన్మదిన శుభాకాంక్షలు.