రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయల్దేరాల్సిన విమానానికి ముప్పు తప్పింది. రేణిగుంట విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. మొత్తానికి ప్రమాదాన్ని ముందే పైలట్ పసిగట్టడంతో.. అటు ఎయిర్‌పోర్టు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.