ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. సరికొత్తగా ఐపీఎల్ తరహాలో టీ-10 టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రేక్షకుల ముందుకురానుంది. వీధుల్లో ఆడే ఆటగాళ్లతో మెగా ఈవెంట్ ప్రారంభంకానుంది. ఇక ఈ తరుణంలోనే.. హైదరాబాద్ టీమ్‌ని హీరో రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. లీగ్ లో భాగం అయిన అమితాబ్ బచ్చన్ (ముంబై), సూర్య (చెన్నై), రామ్ చరణ్ (హైదరాబాద్), అక్షయ్ కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు), సైఫ్ అలీఖాన్, కరీనా (కోల్కత్తా) ఉన్నాయి. కోర్ కమిటీ మెంబర్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
ఇన్నాళ్లు వెలుగులోకి రాలేకపోతున్న యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను వెలికి తీయటానికి ఈ లీగ్ ఉపయోగపడనుంది. స్ట్రీట్ టు స్టేడియం కాన్సెప్ట్ తో లీగ్ నిర్వహణ ఉండనుంది. ఈ లీగ్ లో ఆరు టీమ్స్..తలపడుతున్నాయి. మాఘీ ముంబై, బెంగుళూరు స్ట్రైకర్స్, శ్రీనగర్ కి వీర్, చెన్నై సింఘమ్స్, ఫాల్ఖన్ రైజర్స్ హైదరాబాద్, టైగర్స్ ఆఫ్ కొల్కత్తా టీమ్స్ ఉన్నాయి. ఐపీఎల్ తరహాలో వేలం వేసి క్రీడాకారులను దక్కించుకున్నాయి టీమ్స్.. మొత్తం 96 మంది ప్లేయర్లు ఉంటారు. థానే లోని దాదోజీ కొండదేవ్ స్టేడియం వేదికగా మ్యాచులు జరుగుతాయి.