Sports: అట్టహాసంగా బీసీసీఐ అవార్డుల వేడుక

Sports: Attahasanga BCCI awards ceremony
Sports: Attahasanga BCCI awards ceremony

అట్టహాసంగా బీసీసీఐ అవార్డుల వేడుక జరిగింది. కరోనా కారణంగా 4 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన బీసీసీఐ అవార్డ్స్‌…నిన్న దీనికి సంబంధించిన వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ వేదికగా అట్టహాసంగా బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. 2019-20 ఏడాదికి గానూ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు పేసర్ మహ్మద్ షమి అందుకున్నాడు.

2020 కి ఏడాదికి గానూ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, 2021-22 కి గాను స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా…2022-23కు యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకున్నారు. 2021-22 ఏడాదికి గానూ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డును శ్రేయాస్ అయ్యర్ అందుకున్నారు.

2021-22 సీజన్​కు గానూ రంజీ క్రికెట్​లో అత్యధిక పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ కు మాధవ్​రావ్ సింధియా అవార్డు అందించింది బీసీసీఐ. 2022-23 సీజన్​లో బెస్ట్ స్కోరర్​గా మయాంక్ అగర్వాల్ కి కూడా మాధవ్ రావ్ సింధియా పురస్కారం దక్కింది. మహిళల క్రికెట్​లో 2020-21 ఏడాదికి బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్​గా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన అవార్డు అందుకుంది.