పంజాబ్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ జట్టుకు మరో షాక్ తగిలింది. గుజరాత్ జట్టు కీలక ఆటగాడు డేవిడ్ మిల్లర్ జట్టు నుంచి దూరం కానున్నాడు. అతనికి తీవ్ర గాయం అయింది. దీంతో రెండు వారాలపాటు గుజరాత్ టైటాన్స్ జట్టుకు దూరంగా ఉండనున్నాడు డేవిడ్ మిల్లర్.
గాయం కారణంగానే అతడు పంజాబ్ తో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదని కేన్ విలియమ్స్ వెల్లడించారు. నిన్నటి మ్యాచ్‌లో మిల్లర్‌కు బదులు కెన్ విలియంసన్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా… ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో నిన్న గుజరాత్ టైటాన్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 199 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేధించింది. శశాంక సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ఆ లక్ష్యాన్ని అవలీలగా చేదించింది పంజాబ్.