సర్ఫరాజ్ కు భారత్ నుంచి పిలుపు వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు భారత్ కు ఆడే అవకాశం లభించింది. ఇంగ్లాండుతో రెండో టెస్ట్ కు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో బాధపడుతున్నారని బీసీసీఐ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.
వారి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరబ్ కుమార్ లతోపాటు వాషింగ్టన్ సుందర్ ను కూడా ఎంపిక చేసినట్టు వివరించింది. భారత్ , ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. కాగా, భారత్ క్రికెటర్ సర్ఫ్ రాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ‘నా కుమారుడు సర్ఫ్ రాజ్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేసినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు’ అని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్ట్ కు సర్ఫ్ రాజ్ ను సెలక్టర్లు ఎంపికచేశారు. అతడు 45 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లోనే ఏకంగా 3,912 రన్స్ బాధారు.