అంతర్జాతీయ వన్డేలు, టెస్టులు, టీ20ల నుంచి ఎలాంటి ప్రకటన లేకుండానే తప్పకున్న మహేంద్రసింగ్ ధోని తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గానూ అదే విధంగా వైదొలిగారు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడంపై ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ స్పందించారు. కెప్టెన్ల సమావేశానికి ముందే ఈ విషయం తనకు తెలిసినట్లు ఆయన వెల్లడించారు.
ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, మిస్టర్ కూల్ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. కాగా కెప్టెన్ల ఫొటోషూట్లో ధోనీ లేకపోవడంతో ఆయన సారథిగా తప్పుకున్న విషయం బయటకు వచ్చింది. ఫొటోషూట్ తర్వాత కాసేపటికే చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ప్రకటించింది. కాగా, ఐపీఎల్ చరిత్రలో గ్రేటెస్ట్ కెప్టెన్లలో ఒకరైన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు ట్రోఫీలు అందించారు. కెప్టెన్గా 13 సీజన్ లలో ధోని 10 సార్లు ఆ జట్టును ఫైనలు చేర్చారు. ఇక కెప్టెన్ గా 226 మ్యాచుల్లో 133 విజయాలు, 91 ఓటములు ధోనీ ఖాతాలో ఉన్నాయి. కెప్టెన్గా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన చివరి మ్యాచులో ఐపీఎల్-2023 విజేతగా చెన్నై జట్టును నిలపడం విశేషం.