Sports: IPL 2024లో RCB పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

Sports: Chennai Super Kings win over RCB in IPL 2024
Sports: Chennai Super Kings win over RCB in IPL 2024

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న మొదటి మ్యాచ్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మొదటి మ్యాచ్ లో ఆర్సిబి జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం అందుకుంది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో RCB పై CSK విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

బెంగళూరు జట్టులో దినేష్ కార్తీక్, రావత్ అద్భుతంగా రాణించారు. ఇక ఈ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.4 ఓవర్లలో చేదించింది. 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి విజయం అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో శివం దుబే మరియు రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించారు. దీంతో ఆర్సిబి పై చెన్నై సూపర్ కింగ్స్ అవలీలగా విజయం సాధించింది.