వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ అంతర్జాతీయంగా దూరమైన ప్రపంచంలో వివిధ దేశాలలో జరుగుతున్న T-20 లీగ్ లలో ఆడుతూ ప్రేక్షకులను తనదైన షాట్ లతో అలరిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ వేదికగా లెజెండ్స్ లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు గుజరాత్ జాయింట్స్ మరియు బిల్వారా కింగ్స్ మధ్యన మ్యాచ్ జరుగుతుండగా ఒక ఆసక్తికరమైన ఘటన జరగడం ప్రేక్షకులను ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది అని చెప్పాలి.
మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ ప్లేయర్ క్రిస్ గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక షాట్ ను గట్టిగా కొట్టగా దెబ్బతో బ్యాట్ విరిగిపోయింది. అయితే బ్యాట్ విరిగిపోయిన బంతి మాత్రం బౌండరీకి వెళ్లిపోవడం గమనార్హం. కాగా ఈ ఇన్నింగ్స్ లో క్రిస్ గేల్ కేవలం 27 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ద సెంచరీ సాధించాడు. ఇందులో 8 ఫోర్లు మరియు 2 సిక్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.