ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి ఓటమిని చవిచూసింది. పెద్దగా అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో CSK జట్టు ఏకంగా 20 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. నిన్న జరిగిన మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లాలో ఐదు వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. ఈ తరుణంలోనే నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో 20 పరుగులు తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఏడాది గ్యాప్ తర్వాత బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోని నిన్నటి మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు. 42 సంవత్సరాల వయసులో కూడా ధనార్దన్ షాట్లతో అలరించడం పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ధోని జోరు చూశాక అతడు ఒక ఓవర్ ముందు బ్యాటింగ్కు వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 8వ స్థానంలో బైలోకి దిగడంతో ఓడిపోయిందని పోస్ట్లు పెడుతున్నారు. ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో ధోని 37 పరుగులు 16 బంతుల్లోనే చేసిన సంగతి తెలిసిందే.