టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చూడటానికి బొద్దుగా కనిపించినా ఫిటినెస్లో అతను విరాట్ కోహ్లితో సమానమే అని జట్టు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ అంకిత్ కలియార్ పేర్కొన్నాడు. ‘‘కేవలం భారత జట్టులోనే కాదు ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ఫిట్గా ఉండే ఆటగాడు కోహ్లి. అతను కఠినమైన షెడ్యూల్ను అనుసరించడమే అందుకు కారణం . మ్యాచ్ ఉన్నా లేకపోయినా తన ఆహారం, శిక్షణ, కండిషనింగ్ను నిర్లక్ష్యం చేయడు. దీనికి అతను ఎంతగానో కట్టుబడి ఉంటాడు. జట్టులో ఫిట్నెస్ సం స్కృ తికి ఆద్యు డు అతనే. కోహ్లి కెప్టెన్గా ఉన్నపుడు జట్టులో అందరూ ఫిట్గా ఉండేలా చూసుకున్నడు. ఇప్పుడు అతని స్ఫూర్తితోనే శుభ్మన్ కూడా అత్యున్నత ఫిట్నెస్తో సాగుతున్నాడు. అతను కోహ్లీని అనుసరిస్తున్నాడు. రోహిత్ కూడా ఫిట్గానే ఉంటాడు. చూడ్డానికి బొద్దుగా కనిపించినప్పటికీ కోహ్లి అంతటి ఫిట్నెస్ రోహిత్ సొంతం.
అతనెప్పుడూ యోయో పరీక్షలో ఉత్తీర్ణుడవుతూనే ఉంటాడు. ఈ రోజుల్లో అథ్లెట్ల సామర్థ్యాన్ని అంచనా వేసే యోయో పరీక్ష అనేది చాలా ముఖ్యం . ఫీల్డింగ్లో బంతిని ఆపేందుకు, బ్యాటింగ్లో వికెట్ల మధ్య పరుగులు తీసేందుకు సామర్థ్యం ఎంతో అవసరం. యోయో పరీక్షలో భారత ఆటగాళ్లు 17, అంతకంటే ఎక్కువ స్కోరు సాధిస్తే సఫలమైనట్లే. ఇందులో పాసవడం అంత సులువు కాదు. అందుకు అయిదారు నెలల సాధన అవసరం. నిరంతరం ప్రాక్టీస్ చేసేవాళ్లు యోయోను దాటొచ్చు ’’ అని అంకిత్ వివరించాడు.