Sports: డబుల్‌ సూపర్‌ ఓవర్‌.. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి

Sports: Double super over.. This is the first time in the history of international cricket
Sports: Double super over.. This is the first time in the history of international cricket

డబుల్‌ సూపర్‌ ఓవర్‌..అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్-భారత్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో రెండో సూపర్ ఓవర్ లో ఫలితం తేలడం ఇదే తొలిసారి.

తొలి సూపర్ ఓవర్ లో ఇరుజట్లు స్కోర్లు సమం కాగా, ఆ తర్వాత బిష్నోయ్ సూపర్ ప్రదర్శనతో భారత్ కు విజయం సొంతమైంది. 2020లో కొత్త నిబంధనల ప్రకారం మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్లో ఫలితం తేలకుంటే ఎవరో ఒకరు విజేతగా నిలిచేవరకు…. సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు.

రెండు జట్లు 212 పరుగులు చేయడంతో తొలి మ్యాచ్ టై కాగా.. ఆ తరువాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టీ 20లో విజయం సాధించడం తొలిసారి కావడం విశేషం.