Sports: IPL 2024లో విరాట్ కోహ్లికి కూడా సాధ్యపడద్దు: వీరేంద్ర సెహ్వాగ్

Sports: Even Virat Kohli can't make it in IPL 2024: Virender Sehwag
Sports: Even Virat Kohli can't make it in IPL 2024: Virender Sehwag

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేవలం ఒక్క విజయాన్నే అందుకుంది. దీంతో మరోసారి ఆ జట్టు ప్రదర్శనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ RCB విజేతగా నిలవాలంటే విరాట్ కోహ్లి ఒక్కడిపైనే ఆధారపడటం సరికాదని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఏడు, ఎనిమిది మ్యాచుల్లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడటం కోహ్లికి కూడా అసాధ్యమని వ్యాఖ్యానించారు. కాగా ఈ సీజన్లో ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిన్, మ్యాక్స్వెల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు.

కాగా, నిన్న లక్నోతో మ్యాచులో RCB ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB, 153 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరిలో లామ్రోర్ (13 బంతుల్లో 33) మెరుపులు మెరిపించినా లాభం లేకుండా పోయింది. లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు.