Sports: గిల్ పై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు

Sports: Former cricketer Anil Kumble's key comments on Gill
Sports: Former cricketer Anil Kumble's key comments on Gill

5 టెస్ట్ సిరీస్లలో భాగంగా ఉప్పల్ స్టేడియంలో భారత్ – ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ క్రమంలో భారత్ బ్యాట్స్మెన్ శుభ్ మాన్ గిల్ పై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంగ్లండ్తో టెస్టు తొలి ఇన్నింగ్సులో గిల్ విఫలం కావడంపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అసహనం వ్యక్తం చేశారు. ‘ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ గిల్ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో నేర్చుకోవాలి. పుజారా, ద్రవిడ్ వన్ డౌన్లో రాణించాలంటే గిల్ కచ్చితంగా స్ట్రైక్ రొటేట్ చేయాల్సిందే. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించాలి’ అని సూచించారు.

అయితే ఉప్ప‌ల్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న‌ తొలి టెస్టులో భారత్ భారీ ఆదిక్యం సాధించింది. కేఎల్ రాహుల్(86 : 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ర‌వీంద్ర జ‌డేజా (81 నాటౌట్: 155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్థ సెంచరీలు చేయడంతో రెండో రోజు ఆట ముగిసే స‌రికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 421 రన్స్ చేసింది. దాంతో, రోహిత్ సేన‌ 175 ర‌న్స్ ఆధిక్యంలో నిలిచింది.