Sports: CSK చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన గుజరాత్

Sports: Gujarat lost by CSK
Sports: Gujarat lost by CSK

IPL 2024 టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. మొట్టమొదటి మ్యాచ్లో బెంగళూరు జట్టుకు ఓడించిన CSK… నిన్న గుజరాత్ జట్టును మట్టి కరిపించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో 63 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య సాధనలో గుజరాత్ టైటాన్స్ దారుణంగా విఫలమైంది. 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది. దీనితో 63 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.