Sports: IPL 2024లో ఉత్కంఠ భరితమైన ఆటలో రాజస్థాన్ పై గుజరాత్ విజయం..

Sports: Gujarat win over Rajasthan in thrilling game in IPL 2024.
Sports: Gujarat win over Rajasthan in thrilling game in IPL 2024.

ఐపీఎల్ 2024 టోర్నమెంటు నెంబర్ వన్ జట్టును గుజరాత్ టైటాన్స్ మట్టి కల్పించింది. నిన్న రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య 24 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కేవలం 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

చివరి వరకు పోరాడి జట్టును గెలిపించాడు రషీద్ ఖాన్. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్… చివరి వరకు పోరాడింది. చివర్లో తేవాటియ, రషీద్ ఖాన్ ఆకట్టుకోవడంతో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దీంతో వరుస ఓటముల నుంచి బయటపడింది గుజరాత్ టైటాన్స్.