వచ్చే ఏడాది జరగబోయే IPL సీజన్ కి ముంబై టీంకి హార్దిక్ పాండ్యా సారధిగా ఎంపిక అయ్యాడు. ముంబై యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతనిని కెప్టెన్సీగా ఎంచుకున్నట్టు మహేళా జయవర్ధనే తెలిపాడు. సచిన్ నుంచి హర్భజన్ వరకు టీంకి ఎన్నో సేవలు చేస్తూనే టీం బలోపేతం చేయడానికి దోహదం చేశారు. ఈ తత్వ శాస్త్రానికి అనుకూలంగానే అతనిని కెప్టెన్ చేసినట్లు తెలిపాడు. ముంబై ఇండియన్స్ 5 IPL ట్రోఫీలను గెలిపించిన రోహిత్ శర్మకి షాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితమే ముంబై ఇండియన్స్ నుంచి వెళ్లి గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్గా వ్యవరించిన ఆర్థిక పాండ్యని ఐపీఎల్ ట్రేడ్ ఆప్షన్ ద్వారా మళ్లీ ముంబై కొనుగోలు చేసింది.
రికీ పాంటింగ్ వరుస ఓటములతో 2013 లో ముంబై ఇండియన్స్ టీంకి కెప్టెన్ గా వైదొలగడంతో హిట్ మ్యాన్ సారధిగా బాధ్యతలు స్వీకరించాడు. అతడు బాధ్యతలు స్వీకరించిన మొదటి సీజన్లోనే ముంబై ఇండియన్స్ IPL ట్రోఫీని గెలిచింది. సచిన్, పాంటింగ్, జై సూర్య, షాన్ పోలాక్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అందించ లేనటువంటి ట్రోఫీని ముంబై టీంకి రోహిత్ శర్మ అందించాడు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 2015, 2017, 2019, 2020 లలో ట్రోపిని గెలుచుకుంది.