Sports: ఛాంపియన్స్‌ ట్రోఫీ వేదికల రేసు నుంచి పాకిస్తాన్‌ తప్పుకుందా..?

Sports: Has Pakistan left the race for Champions Trophy venues?
Sports: Has Pakistan left the race for Champions Trophy venues?

ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్లో నిర్వహిస్తామని ఇదివరకే ఐసీసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే దాయాదులతో ఉన్న సరిహద్దు సమస్యల కారణంగా ఇండియా అక్కడికి వెళ్లడం లేదు.ఈ టోర్నీ వేదికలు మారుతాయని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ జకా అష్రఫ్‌.. UAE క్రికెట్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ ఖలీద్‌ అలీ జరూనీతో దుబాయిలో సమావేశం అయ్యారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరునట్లు అయింది.ఐసీసీ జనరల్‌ కౌన్సిల్‌ జొనాథన్‌ హాల్‌, ఖలీద్‌ అలీతో కూడా జకా అష్రప్ సమావేశమయ్యారు. ఈ ముగ్గురి సమావేశం కూడా వేదిక మారవచ్చు అనే ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చింది.

ఇటీవల ఆసియా కప్ పాకిస్తాన్లో జరగగా భారత్ అక్కడికి వెళ్లలేదు. దీంతో ఇండియా మ్యాచ్ లన్ని శ్రీలంకలో నిర్వహించారు. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ లో జరగనుందని… కేవలం ఇండియా మ్యాచ్ లన్ని దుబాయ్ వేదికగా నిర్వహించాలని పిసిబి భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై అది కారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి మరి.