Sports: IPL 2024లో సెంచరీతో విజృంభించిన హెడ్.. సన్ రైజర్స్ భారీ స్కోరు

Sports: Head explodes with a century in IPL 2024.. Sunrisers' big score
Sports: Head explodes with a century in IPL 2024.. Sunrisers' big score

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

చినస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో SRH ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆర్సీబీతో పోరులో ట్రావిస్ హెడ్ ధనాధన్ ఇన్నింగ్ ఆడుతున్నారు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మొత్తం 7 సిక్సులు, 4 ఫోర్లతో చేసిన హెడ్ చేశాడు. అర్థ సెంచరీ తర్వాత కూడా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డ హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 8 సిక్సర్లు, 9 ఫోర్లతో విధ్వంసం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.