Sports: వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌’ కెప్టెన్‌గా హిట్ మ్యాన్

Sports: Hit man as captain of ODI team of the year
Sports: Hit man as captain of ODI team of the year

ఇంటర్నేషనల్ లెవెల్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఐసీసీ టి20 ఆఫ్ ది ఇయర్ ప్లేయర్ లిస్టును ప్రకటించగా అందులో నలుగురు టీమిండియా ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. తాజాగా ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ టీం ను ప్రకటించగా అందులో ఆరుగురు భారత ఆటగాళ్లు స్థానం సొంతం చేసుకున్నారు .

గతేడాది వన్డేలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన 11 మంది క్రికెటర్లు ఉన్న జట్టును ఐసీసీ ప్రకటించింది.ఈ టీమ్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా, గిల్ ఓపెన‌ర్‌గా ఎంపిక‌య్యారు. పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ, చైనా మెన్ స్పిన్నర్ కుల్దీప్ యాద‌వ్, హైదరాబాది స్టార్ బౌలర్ సిరాజ్, మహమ్మద్ ష‌మీలు 11 మందిలో చోటు సంపాదించుకున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో ఆడిన 22 మంది ఆటగాళ్ల నుంచి ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు ఈ లిస్టులో చోటు సంపాదించుకోవడం విశేషం.

వన్డే ఆఫ్ ది ఇయ‌ర్ : రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్,విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్, మార్కో జాన్‌సేన్, ఆడం జంపా,డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్), కుల్దీప్ యాద‌వ్, మ‌హ్మ‌ద్ సిరాజ్,మ‌హ్మ‌ద్ షమీ.