టెస్టుల్లో బజ్ బాల్ అస్త్రంతో ప్రపంచ అగ్రశ్రేణి జట్లను వణికిస్తున్న ఇంగ్లండ్ కు భారత్ ఝలక్ ఇచ్చింది. ఐదు టెస్టులలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ ఇంగ్లాండ్ ను ఓడించింది.కెప్టెన్ రోహిత్ శర్మ తన పదునైన ప్లాన్స్ తో బాజ్‌బాల్ దూకుడుకు కళ్లెం వేశారు. కుర్రాళ్లతో కూడిన జట్టును నడిపించిన హిట్‌మ్యాన్ ‘బాజ్‌బాల్’ జట్టుకు తొలిసారి సిరీస్ ఓటమి రుచి చూపించిన కెప్టెన్‌గా నిలిచారు. ఇంగ్లండ్ కోచ్ గా మెక్కల్లమ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి.
ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది .ఇంకా సిరీస్ లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడా తో సిరీస్ ని సొంతము చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 ని స్కోర్ చేసింది రెండవ ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేసింది. భారత్ తొలి లింక్స్ లో ఇన్నింగ్స్ లో 307 పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు ని నష్టపోయి 192 పరుగులు భారత్ చేసింది.