నిన్న ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా హైదరాబాద్, పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 2 పరుగులు తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ బ్యాటర్లలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 64 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.
ఇక నిన్నటి మ్యాచ్ లో మెరుపు అర్థ సెంచరీ తో హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ కు ముందు తాను పవన్ కళ్యాణ్ జానీ సినిమాలోని నా రాజుగాకురా మా అన్నయ్య పాట వింటానని తెలిపారు. ఇది తనకు మరింత ఎనర్జీని ఇస్తుందన్నారు. ఈ వీడియో లో ఆయనే పాట పాడటం గమనార్హం.