సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమ్ఇండియా ఆదివారం రెండో టీ20లో 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 53(25), ఇషాన్ కిషన్ 52( 32), రుతురాజ్ గైక్వాడ్ 58(43) మెరవడంతో మొదట భారత్ 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. రింకు సింగ్ 31 నాటౌట్(9) కూడా ఆకట్టుకున్నాడు. ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. రవి బిష్ణోయ్ (3/32), ప్రసిద్ధ్ కృష్ణ (3/41) ధాటికి 9 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. అక్షర్ పటేల్ (1/25) చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. స్టాయినిస్ 45( 25) ఆసీస్ టాప్ స్కోరర్. టిమ్ డేవిడ్ 37(22), వేడ్ 42 నాటౌట్(23) రాణించారు. జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవారు లభించింది. ఈ విజయంతో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సంపాదించింది. మూడో మ్యాచ్ మంగళవారం గువహటిలో జరుగుతుంది.
స్మి త్ 19 (16), షార్ట్ 19(10) ఇచ్చిన మెరుపు ఆరంభమిది. రెండో ఓవర్లో ప్రసిద్ధ్ 20 పరుగులు ఇచ్చాడు. కానీ జోరు మీదు కనిపించిన ఆసీస్.. అనూహ్యంగా తడబడింది. ప్రమాదకర మ్యాక్స్ వెల్ (12)ను అక్షర్, స్మిత్‌ను ప్రసిద్ధ్ ఔట్ చేయడంతో ఆసీస్ చిక్కుల్లో పడింది. కానీ స్టాయినిస్, టిమ్ డేవిడ్ల విధ్వంసక బ్యాటింగ్‌తో ఆ జట్టు పోటీలోకి వచ్చింది. ఆసీస్ 13 ఓవర్లలో 135/4తో నిలిచింది. ఒకే ఓవర్లో అబాట్, ఎలిస్‌ను ఔట్ చేసి భారత్ పనిని ప్రసిద్ధ్ మరింత తేలిక చేశాడు. ఆఖర్లో వేడ్ పోరాటం .. ఆస్ట్రేలియా ఓటమి అంతరాన్ని తగ్గించగలిగిందంతే.