Sports: IPL 2024: ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించిన SRH

Sports: IPL 2024: SRH with a big win over Mumbai Indians
Sports: IPL 2024: SRH with a big win over Mumbai Indians

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. నిన్న ముంబై జట్టుపై ఏకంగా 31 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇందులో హైదరాబాద్ బ్యాటర్ హెడ్ 62 పరుగులు చేశారు.

అభిషేక్ శర్మ 63 పరుగులు చేశాడు. ఇక క్లాసన్ 34 బందులో 80 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్… మొదటినుంచి తడబడుతూనే ఉంది. ఇక చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ 246 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ చేతిలో 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది.