కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడడానికి అయిష్టత చూపిస్తూ కేవలం ఐపీఎల్ మీదే దృ ష్టిపెట్టడం బీసీసీఐ కొత్త నిబంధన తేవడానికి కారణమైంది. భారత జట్టులో లేనపుడు ఐపీఎల్లో పాల్గొనాలంటే ఓ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడాన్ని బీసీసీఐ తప్పనిసరి చేయనుంది. రంజీల్లో ఝార్ఖండ్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాలని ఇషాన్ కిషన్‌ను బోర్డు ఇప్పటికే ఆదేశించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చాక, ప్రయాణ బడలికను కారణంగా చూపిస్తూ ఝార్ఖండ్ మ్యాచ్‌లకు అతడు వరుసగా డుమ్మా కొట్టడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదట.
మరొక విషయం ఏంటంటే.. తన రాష్ట్ర జట్టు గ్రూప్-ఏలో దాదాపుగా అట్టడుగున ఉండగా, కిషన్ మాత్రం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌తో కలిసి బరోడాలో సాధన చేస్తున్నట్లు బోర్డుకు తెలిసింది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు కేవలం ఐపీఎల్లో ఆడడంపైనే దృష్టిపెట్టకుండా చూసేందుకు కఠిన విధానం అమలు చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చింది. ‘‘అలాంటి ఆటగాళ్లను అదుపు చేయడానికి.. కనీసం 3-4 రంజీ మ్యాచ్‌లు ఆడడాన్ని తప్పనిసరి చేయాలని బీసీసీఐ భావిస్తోంది. లేదంటే వాళ్లు ఐపీఎల్ లేదా ఫ్రాంఛైజీలు విడుదల చేసినపుడు ఐపీఎల్ వేలంలో పాల్గొనడానికి అనర్హులవుతారు’’ అని పేర్కొన్నాడు.
రంజీల్లో లేదా దేశవాళీలో ఆడకపోతే ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తారనే చర్చ మొదలైంది. అయితే, దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ‘‘సెంట్రల్ కాంట్రాక్ట్‌లకు సంబంధించి చర్చే జరగలేదు. ప్రతి ఒక్క రూడొమిస్టిక్ క్రికెట్ ఆడాలనేది బోర్డు ఆకాంక్ష. ఇప్పటికైతే కాం ట్రాక్ట్‌లను రద్దు చేసే యోచన చేయడం లేదు’’ అని ఓ అధికారి తెలిపారు.