వెన్ను గాయంతో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు దూరమైన టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధించాడు. రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉండనున్నాడు. శుక్రవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్లో జడేజా పాల్గొన్నాడు. బౌలింగ్ సాధన చేశాడు. కసరత్తులు చేయడంలోనూ ఇబ్బందిపడలేదు. జనవరి 3న రెండో టెస్టు ఆరంభమవుతుంది.