Sports: బాధలోనూ సంతోషం… అత్యధిక “మ్యాన్ ఆఫ్ ది సీరీస్”ల రికార్డ్ కోహ్లీ కే !

Sports: Joy in pain... Kohli holds the record for the highest number of "Man of the Series"!
Sports: Joy in pain... Kohli holds the record for the highest number of "Man of the Series"!

ఆస్ట్రేలియా జట్టు వన్ డే వరల్డ్ కప్ 2023 లో ఇండియాను ఘోరంగా ఓడించి కప్ ను తన్నుకుపోయింది. టోర్నీ ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన చేసిన టీం ఇండియా ఫైనల్ లో తడబడి కప్ ను కోల్పోయింది. ఈ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలవగా, అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్ గా మహమ్మద్ షమీ రికార్డును సాధించాడు. ఈ టోర్నమెంట్ లో విరాట్ కోహ్లీ సాధించిన ప్లేయర్ అఫ్ ది సిరీస్ తో కెరీర్ లోనే 21 సార్లు అవార్డు అందుకున్న ప్లేయర్ గా ఘనతను సాధించాడు.

ఈ రికార్డును విరాట్ కోహ్లీ 157 సిరీస్ లలో ఆడడం ద్వారా సాధించడం విశేషం. ఇక కోహ్లీ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ 20 సార్లు నెగ్గాడు.వరల్డ్ కప్ కోల్పోయిన బాధలోనూ కొంచెమైనా సంతోషమంటే కోహ్లీ, మహమ్మద్ షమీ ల గర్వించదగిన ప్రదర్శన కారణం అని చెప్పాలి. ఇక ఈ టోర్నీ తర్వాత నవంబర్ 23 నుండి జరగనున్న సిరీస్ కు సీనియర్ ప్లేయర్స్ అందరూ విశ్రాంతి తీసుకోనున్నారు.