Sports: IPL 2024లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కేకేఆర్… బ్రేక్ వెయ్యలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్

Sports: KKR, who are riding a streak of victories in IPL 2024... Delhi Capitals who could not break
Sports: KKR, who are riding a streak of victories in IPL 2024... Delhi Capitals who could not break

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 3 మ్యాచ్లు గెలిచిన కేకేఆర్ బుధవారం మరో మ్యాచ్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది కేకేఆర్. విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

కేకేఆర్ సాధించిన 273 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రిషబ్ పంత్ 55 పరుగులు, స్టాబ్స్ 54 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా రాణించలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అటు అంతకుముందు కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరేన్, రింకు, రస్సెల్ భయంకరమైన బ్యాటింగ్ చేశారు. దీంతో 273 పరుగులు చేసింది కేకేఆర్.