ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. ధర్మశాల వేదికగా భారత్ ,ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టులో అరుదైన రికార్డ్ సాధించాడు.147ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్ గా నిలిచారు. 187టెస్టుల్లో అండర్సన్ ఈ ఫీట్ సాధించారు. ఈ టెస్టులో భారత్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడంతో ఈ రికార్డు నమోదైంది.
ఇదిలా ఉంటే… ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్. దీని గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ధర్మశాల టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్… ‘నేను నీకు 700వ వికెట్ కాబోతున్నాను’ అని ముందుగానే చెప్పినట్లు అండర్సన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘కుల్దీపు ఔట్ కావాలని లేదు. కాకపోతే తనకు ముందే అనిపించిందని నాతో చెప్పాడు’ అని ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ తెలిపారు. కాగా,టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్ల రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముతయ్ మురళీధరన్ పేరిట ఉంది. సెకండ్ ప్లేస్ లో వార్న్ (ఆస్ట్రేలియా) – 708 వికెట్లు(145 మ్యాచుల్లో) ఉన్నాడు. భారత్ నుంచి కుంబ్లే (భారత్ ) – 619 వికెట్లు(132 మ్యాచుల్లో) ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు.