ఆఫ్గాన్ తో తొలి 2 టీ20ల్లో అర్థ సెంచరీలు చేసిన శివమ్ దుబే వార్తల్లో నిలిచారు. దీనితో అతని వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దుబే భార్య అంజుమ్ ఖాన్(UP). మోడల్ గా రాణిస్తున్న ఆమెతో ఓ ఈవెంట్ లో దూబేకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
మతాలు వేరు కావడంతో వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పగా… ఎంతో కష్టపడి ఒప్పించారు. 2021లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు. దీంతో టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే లవ్ స్టోరీ వైరల్ గా మారింది.
కాగా టీమిండియా జట్టులో హార్థిక పాండ్య ప్లేస్ ను భర్తీ చేస్తున్నాడు ఆల్ రౌండర్ శివమ్ దూబే. తొలి టీ20లో 60*, రెండో టీ20 లో 63* రన్స్ చేసి, భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. బౌలింగ్ వేసి రెండు వికెట్లు కూడా పడగొట్టారు. దీంతో దూబేను ఈ ఏడాది జరిగే టీ20 WCకు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మాటిమాటికి గాయాలపాలయ్యే హార్దిక్ పాండ్యా స్థానంలో ఇతడికి చోటివ్వాలని పోస్టులు చేస్తున్నారు.