ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించిన పార్థివ్ పటేల్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని తప్పులు చేశాడేమో కానీ రోహిత్ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదని కొనియాడారు.
ఇటీవల ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుంచి తప్పించి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలు అందించింది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీని మించిన నాయకుడు రోహిత్ శర్మ అని పార్థివ్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.హార్దిక్ పాండ్య, బుమ్రాను యాజమాన్యం పక్కనపెట్టాలని భావించినా.. రోహిత్ శర్మ మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో భాగమయ్యారని వెల్లడించారు. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు ఒక పరుగు తేడాతో కప్ గెలిచిందని గుర్తు చేశారు.
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కాగా, మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా ముంబై తమ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ తో పోటీ పడుతుంది.