టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పూజారా మరియు రహానేలకు మరోసారి నిరాశ ఎదురయింది. ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అజింక్య రహానే మరియు పూజారాలకు చోటు దక్కలేదు. రంజిత్రోఫీలో డబుల్ సెంచరీ చేసినప్పటికీ భుజాలకు సెలక్టర్లు మొండి చెయ్యి చూపించారు.
దీంతో వీరి టెస్ట్ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా సిరీస్ కు సీనియర్లను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.