Sports: చాహాల్ బహిర్గతం చేసిన రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ

Sports: Rajasthan Royals new jersey unveiled by Chahal
Sports: Rajasthan Royals new jersey unveiled by Chahal

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం కొత్త జెర్సీ డిజైన్‌ను వెల్లడించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కొత్త మ్యాచ్ డే కిట్, జెర్సీని ఆవిష్కరించారు. వచ్చే సీజన్లో ఈ జెర్సీతో రాజస్థాన్ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. మునుపటితో పోలిస్తే కొత్త జెర్సీలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా RR అవతరించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్ మరో టైటిల్ సాధించలేదు. ఇక ఎలాగైనా ఈసారి కప్ కొట్టాలని ఆ జట్టు భావిస్తోంది. ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ జట్లు తరపడనున్నాయి. మార్చి 24న రాజస్థాన్ రాయల్స్‌, లక్నో సూపర్ జయింట్స్ తో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.