స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించారు. సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ లో సెంచరీ(112*) బాదారు. దీంతో టెస్టుల్లో 97 మ్యాచుల్లో 30 సెంచరీలు చేసి బ్రాడ్‌మన్, విరాట్ ను అధిగమించారు. బ్రాడ్‌మన్ (52 టెస్ట్‌లు), కోహ్లి (113 టెస్ట్‌లు) 29 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో కేన్ వీరిద్దరినీ దాటారు. అతడు గత 9 టెస్ట్ ఇన్నింగ్స్ ల్లోనే 5 సెంచరీలు చేయడం విశేషం.
బే ఓవల్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. టామ్ లాథమ్(20), డెవాన్ కాన్వే(1)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.అయితే యువ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర(118 నాటౌట్ : 211 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్), విలియమ్సన్(112 నాటౌట్ : 259 బంతుల్లో 15 ఫోర్లు) మాత్రం సౌత్ ఆఫ్రికా బౌలర్లపై చెలరేగి ఆడారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 219 పరుగులు జోడించారు. దాంతో, కివీస్ తొలి రోజు ఆట ముగిసే సరికి 258 పరుగులు చేసింది.