ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ లో ఓటమిపై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ‘తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల లీడ్ రావడంతో గెలుస్తాం అనుకున్నాం. కానీ పోప్ అద్భుతంగా ఆడాడు. భారత్ లో విదేశీ బ్యాటర్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే. 230 పరుగులు చేదించడం కష్టమేం కాదు. కానీ మేము బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. లోయర్ ఆర్డర్ చాలా బాగా ఆడింది. వారిని చూసి పరుగులు ఎలా చేయాలో టాపార్డర్ నేర్చుకోవాలి’ అని అన్నారు.
అయితే భారత్ ఓడిపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 196 పరుగులతో రాణించిన ఓలి పోప్ రెండుసార్లు క్యాచులు ఇచ్చిన మనవాళ్లు జారవిడిచారు.రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మరియు జడేజా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. అటు భారత్ బ్యాటర్లలో జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ మరియు గిల్ ఘోర ప్రదర్శన కారణంగా భారత్ ఓటమిపాలైంది.