ఆరంగేట్ర మ్యాచ్ లోనే భారత్ యువ బ్యాటర్ సర్పరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో అదురగొట్టారు. రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో కేవలం 48 బంతుల్లోనే 50 రన్స్ చేసి వారెవ్వా అనిపించాడు. ప్రస్తుతం సీనియర్ ఆల్ రౌండర్ జడేజా తో కలిసి క్రీజులో ఉన్నాడు. ఆరంగేట్రం మ్యాచ్ లోనే అత్యంత వేగంగా అర్థసెంచరీ బాదిన తొలి భారత్ క్రికెటర్ గా సర్ఫరాజ్ రికార్డును నెలకొల్పాడు.
దీంతో సర్పరాజ్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు ఆల్ రౌండర్ జడేజా కూడా సెంచరీ చేశాడు. టెస్ట్ ల్లో నాలుగో సెంచరీ చేశాడు జడేజా. దీంతో 2018 నుంచి భారత్ లో టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలను సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు జడేజా. ఇప్పటివరకు జడ్డూ సొంత గడ్డపై 9 అర్థ సెంచరీలు చేశాడు. ఆ తరువాత స్థానాల్లో రోహిత్ శర్మ (7) ఉన్నాడు. మరోవైపు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నిన్న సెంచరీ చేయడం విశేషం.