Sports: భారత్ కు షాక్… మొదటి టెస్ట్ లో ఇంగ్లండ్ విజయం

Sports: Shock for India...England's victory in the first Test
Sports: Shock for India...England's victory in the first Test

భారత్-ఇంగ్లండ్ మధ్య 5 టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. నిన్న నాలుగో రోజు నువ్వా-నేనా అని హోరా హోరీగా జరిగిన పోరులో భారత్ ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చతికిల పడింది.

పరుగులు చేయడంలో టీమిండియా బ్యాటర్లు విఫలం చెందారు. చివరికీ అశ్విన్, సిరాజ్ స్టంప్ ఔట్ కాకుంటే భారత్ విజయం సాధించి ఉండేది. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 టార్గెట్ ను ఛేదించలేకపోయింది. 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్ హార్ట్ లీ 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ (39), భరత్, అశ్విన్ మినహా భారత్ బ్యాటర్లు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయారు. చివరలో బుమ్రా, సిరాజ్ విజయం సాధిస్తారనుకునే లోపే హార్ట్ లీ బౌలింగ్ లో సిరాజ్ ముందుకు రావడంతో స్టంప్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ విజయం సాధించింది.