రెండో టెస్ట్ లో భారత బౌర్లు విజృంబించారు. దక్షిణాఫ్రికాపై హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. తొమ్మిది ఓవర్లు వేసిన సిరాజ్ 6 వికెట్లు తీసి 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 ఓవర్లు మెయిడిన్ వేశాడు సిరాజ్. బుమ్రా కూడా బౌన్సర్లతో సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చాడు. సిరాజ్ 6 వికెట్లు తీయగా.. బుమ్రా, ముకేష్ కుమార్ చెరో రెండు వికెట్లను తీశారు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు కేవలం 23.2 ఓవర్లలో 55 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
సౌత్ ఆఫ్రికా జట్టులో బెడింఘమ్ (12), వెర్రెయిన్నే (15) మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు. మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ప్రధానంగా సిరాజ్ 6 వికెట్లు తీసి మంచి ఫామ్ లో ఉన్నాడు. అతనికి తోడు బుమ్రా కూడా బౌన్సర్లతో చెలరేగాడు. సిరాజ్, బుమ్రా దెబ్బకు సఫారీల జట్టు సైలెంట్ గా వెనుదిరుగాల్సి వచ్చింది. వీరికి తోడు ముఖేష్ కుమార్ కూడా 2 వికెట్లు తీశాడు.