ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం పన్నెండు రౌండ్లు ముగిసేసరికి అతడు 9 పాయింట్లతో మరో భారత గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్, మాగ్నస్ కార్ల్సన్, ఇయాన్ నెపోమ్నిషి, లాగ్రెవ్, దుబోవ్, రియాజాన్త్సెవ్ లతో కలిసి ముందంజలో ఉన్నాడు. 12 రౌండ్లలో అర్జున్ 8 విజయాలు సాధించాడు. రెండింట్లో ఓడి.. రెండు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. నిహాల్ సరీన్ 6 మ్యాచ్‌లు గెలిచి.. 6 మ్యాచ్‌లు డ్రాగా ముగించాడు. మహిళల విభాగంలో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారిక ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతోంది. 10 రౌండ్లలో 5 విజయాలు, రెండు డ్రాలు, మూడు ఓటములతో ఆమె 7 పాయింట్లు సాధించింది. వాలెంటీనా (రష్యా , 8.5) అగ్రస్థానంలో ఉంది. కోనేరు హంపి (5.5) 31వ స్థానంలో ఉంది.