ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై వరుసగా రెండో విజయాన్ని సాధించింది. వాంఖడే మైదానంలో ముంబయిపై 20 పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్లో MS ధోనీ హ్యాట్రిక్ సిక్స్లు బాదగా, బౌలింగ్లో పతిరన నిప్పులు చెరిగాడు. మ్యాచ్ విజయంలో వారిద్దరి పాత్ర కీలకమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. రుతురాజ్, శివమ్ దూబె హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ముంబయిపై విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ, మా యువ వికెట్ కీపర్ (ఎంఎస్ ధోనీని ఉద్దేశించి) కొట్టిన మూడు సిక్స్లు జట్టును ఆదుకున్నాయి. ఇలాంటి పిచ్పై మేం చేసిన దానికంటే మరో 15 పరుగులు అవసరమని భావించా. బుమ్రా అద్భుతంగా బౌలిం గ్ వేశాడు. లక్ష్య ఛేదనలో బంతితో మేం మెరుగ్గా రాణించాం . హార్డ్ హిట్టర్లున్న ముంబయిని కట్టడి చేయడం సులువేం కాదు. మా యువ మలింగ (పతిరన) మరోసారి పదునైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధమే’’ అని రుతురాజ్ తెలిపాడు.