భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించాడు. 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో అత్యధికులు శోధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 1998లో స్థాపించిన గూగుల్ 25 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో అత్యధికంగా శోధించిన సందర్భాలు, సెలబ్రిటీల వివరాలతో కూడిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. క్రికెటర్ల విభాగంలో కోహ్లీని అందరి కంటే ఎక్కువగా శోధించారు. ఇక ఈ ఏడాదిలో అత్యధిక మంది శోధించిన భారత క్రికెటర్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ జాబితాలో గిల్ 9వ స్థానంలో నిలిచాడు. అతడికంటే ముందు మరో క్రికెటర్ రచిన్ రవీంద్ర (8వ స్థానం ) ఉన్నాడు. భారత మూలాలు కలిగిన రచిన్ కివీస్ తరఫున వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అతడి పేరులో రాహుల్ ద్రవిడ్ – సచిన్ కలిసి ఉండటంతో క్రికెట్ అభిమానులు విపరీతంగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.