నిన్న దుబాయ్ వేదికగా ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోని వారసుడి కోసం గత పదేళ్లుగా అన్వేషిస్తున్నామని ప్రతి ఏడాది చెన్నై కెప్టెన్సీ గురించి చర్చలు జరుగుతున్నాయని…. కానీ ధోని మాత్రం ఎప్పటిలాగే తన కెప్టెన్సీ తో తన మార్కు చూపిస్తున్నాడని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్గా రాబోయే ఐపీఎల్ సీజన్ కి ధోని సారథ్యం వహిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
అయితే ఆ తర్వాత సీజన్ కి ధోని రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
డారెల్ మిచెల్ ని వేలంలో అధిక ధరకు కొనుగోలు చేయడంపై స్పందిస్తూ మిచెల్ గత ఏడాదిన్నరగా బాగా రాణిస్తున్నాడని అలాగే ఒత్తిడి పరిస్థితులలో కూడా బాగా ఆడగలరని స్పిన్నును కూడా సరిగా ఎదుర్కొ కోగలడని చెప్పాడు. అయితే మిచెల్ కి బౌలింగ్ చేసే సత్తా కూడా ఉందని మా జట్టుకి ఈ కొనుగోలు ఎంతో ఉపయోగపడుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. నిన్న జరిగిన వేలం పాటలో డారెల్ మిచెల్ ని 14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.