ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ నుంచి స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఇంగ్లండ్తో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న రాజ్కోట్ నుంచి అర్ధాంతరంగా చెన్నై వెళ్లిపోయాడు. దీంతో మూడో రోజంతా నలుగురు బౌలర్లతోనే భారత్
ఆడింది.
అయితే ఆ సమయంలో జట్టులో ఏం జరిగిందో రోహిత్ వెల్లడించారు. ‘విషయం తెలియగానే ఇక మా మనసులో వేరే ఆలోచన లేదు. కుటుంబం కంటే ఎవరూ ఎక్కువ కాదు. వెంటనే బయలుదేరమని చెప్పాం. తను వెళ్లి మళ్లీ తిరిగొచ్చి టెస్టులో పాల్గొన్నాడు. ఆట పట్ల అతడి అంకితభావానికి అది నిదర్శనం’ అని రోహిత్ శర్మ తెలిపారు.ఇక మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో గెలిచిన ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా నిర్దేశించిన 557 రన్స్ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్.. 122 పరుగులకే ఆలౌట్ కావడంతో టెస్టుల్లో అతి పెద్ద విజయం సాధించింది.