వైజాగ్ లోని డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారీ స్కోరు దిశగా భారత్ దూసుకుపోతోంది. టాప్ ఆర్డర్ వైఫల్యం మధ్య భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆశలు కల్పించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు నష్టానికి 336 పరుగులు చేసింది.
అయితే..ఈ విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో ద్విశతకం నమోదుచేశారు. మరోవైపు ఈరోజు తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికి అశ్విన్ (20) అవుట్ అయ్యారు. కుల్దీప్ యాదవ్ తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.