బాలయ్య మీద ఎన్టీఆర్ ఫాన్స్ రుసరుసలు…

Sr NTR fans angry on Balakrishna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగునాట ఏ ఇంటి ఇలవేలుపు ఎవరైనా కంటి ముందు కనిపించే రూపం ఎన్టీఆర్. ఆ రూపం ఒక రాముడు, ఒక కృష్ణుడు. అలా గుర్తున్నాడు కాబట్టే చనిపోయి 22 ఏళ్ళు గడిచినా ఎన్టీఆర్ ఇంకా ఆరాధ్యనీయుడు. బతికి ఉండగా ఆయనతో విభేదించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన పేరు చెప్పుకోక తప్పనిసరి పరిస్థితి. అది ఎన్టీఆర్ స్థాయి. అయితే ఆయన ఆత్మ ఇప్పుడు ఘోష పడుతూ ఉండి ఉంటుంది.

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల పేరు కి ఎంత గౌరవం వుందో వేరే చెప్పక్కర్లేదు. అందుకే ఆ గౌరవం కాపాడేందుకే ఎన్టీఆర్ చనిపోయినప్పుడు లక్ష్మీపార్వతి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ విచారణకు ఆదేశించలేదు. ఆపై ఇతర పార్టీ ప్రభుత్వాలు వచ్చినా ఎన్టీఆర్ జోలికి మాత్రం వెళ్ళలేదు. ఎన్టీఆర్ సీఎం గా వున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా వై.ఎస్ ఆయన ఇంటి ముందే నానా హంగామా చేశారు. కానీ తాను అధికారంలోకి వచ్చాక చంద్రబాబుని టార్గెట్ చేయడానికి ఎన్టీఆర్ పేరు వాడారు. ఇక ఎన్టీఆర్ స్ఫూర్తి తోనే మళ్ళీ కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని తెచ్చారు. ఆ పై తాను బతికున్న రోజుల్లో బద్ధశత్రువుగా భావించిన కాంగ్రెస్ నేతలు కూడా ఎన్టీఆర్ ని ఓన్ చేసుకుంది. అలాంటి ఎన్టీఆర్ ప్రతిష్టకి ఇప్పుడు మచ్చ వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ పాపంలో అందరి భాగం ఉంది.

ఏ సినిమా అయితే ఎన్టీఆర్ ని దేవుడిగా నిలబెట్టిందో అదే సినిమా ఇప్పుడు ఆయన గౌరవానికి ఇబ్బందిగా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ అని బాలయ్య ఏ ముహూర్తాన అన్నాడో గానీ ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు తెర మీదకి వచ్చాయి. బాలయ్య సినిమా ఆయన గ్లోరీ చూపుతుంటే మిగిలిన రెండు సినిమాలు ఆయన గౌరవం దెబ్బ తీసే టాపిక్ ని టచ్ చేస్తున్నాయి. నిజానికి వీళ్ళ టార్గెట్ చంద్రబాబు, లక్ష్మీపార్వతి. అయితే అది పరోక్షంగా ఎన్టీఆర్ గౌరవాన్ని దెబ్బ తీసేవే. అందుకే అశేష ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బయోపిక్ టాపిక్ తెచ్చిన బాలయ్య మీద రుసరుసలాడుతున్నారు. ఇప్పుడు వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీర గ్రంథం టైటిల్స్, పోస్టర్స్ చూస్తుంటే వారి ఆవేదనలో అర్ధం ఉందనిపిస్తోంది.